ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది.. ఊహించినట్టుగానే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అంచనాలకు తగ్గట్టు టీజర్ లేదని.. ప్రభాస్‌ను యానిమేటేడ్గా చూపించారని.. ఇదో మోషన్ క్యాప్చర్ మూవీ అని.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డైరెక్టర్ ఓం రౌత్ పై రకరకాల ట్రోలింగ్ జరుగుతున్నా.. టీజర్ మాత్రం వరల్డ్ వైడ్‌గా.. యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ దుమ్ముదలిపేస్తోంది. అన్ని భాషల్లో ఆదిపురుష్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు నార్త్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే సాహో సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినా.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఇక ఇప్పుడు ‘ఆదిపురుష్’ టీజర్‌కు హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆదిపురుష్ రికార్డు సృష్టించింది. కేవలం 16 గంటల్లోనే 56 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే అత్యధిక లైక్‌లు పొందిన టీజర్‌గా నిలిచింది. మొత్తంగా హిందీలో ‘ఆదిపురుష్’ అత్యధిక లైక్‌లు మరియు వ్యూస్ రాబట్టిన టీజర్‌గా నిలిచింది. ఒక్క టీజర్‌కే నార్త్‌లో ఇంత క్రేజ్ ఉంటే.. ఇక సినిమా రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి అంచనాలను తలకిందులు చేస్తు.. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.