‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమా టీజర్ అంచనాలకు తగ్గట్టుగా లేదనే వాదన బలంగా వినిపించింది. ఇదొక యానిమేషన్ మూవీ అని.. విజువల్ ఎఫెక్ట్స్.. రావణుడి పాత్ర పై.. ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగిందని.. దర్శకుడు ఓం రౌత్ పై విరుచుకుపడ్డారు. అయినా కూడా ఆదిపురుష్ టీం ట్రోల్స్‌కు ధీటుగా టీజర్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఆదిపురుష్ మొబైల్ కోసం కాదని.. సిల్వర్ స్క్రీన్ పై.. అది కూడా 3డి లో చూస్తే.. ఆ ఫీల్ వేరేలా ఉంటుందంటున్నారు. అందులోభాగంగా హైదరాబాద్‌లో మీడియాకు ఆదిపురుష్ త్రీడీ టీజర్‌ను ప్రదర్శించారు.
ఇక ఈ టీజర్‌ను త్రీడిలో చూసిన తర్వాత ఇటు మీడియా, అటు అభిమానుల నుంచి బాగుందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. దాంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవడమే కాదు.. టీజర్ టాక్ మారిపోయినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం 60 థియేటర్స్‌లో ఈ టీజర్‌ని త్రీడిలో ప్లాన్ చేస్తున్నారు. పైగా మన్ముందు మరింత మంచి కంటెంట్‌తో రాబోతున్నట్టు ప్రకటించాడు ప్రభాస్. ఇక నిర్మాత దిల్ రాజు.. ట్రోలింగ్ పై కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దాంతో నెగెటివ్‌తో మొదలైన ఆదిపురుష్ టాక్.. మెల్లిగా రాను రాను పాజిటివ్‌గా మారడం ఖాయమంటున్నారు. అలాగే ట్రోలింగ్ ఎలా ఉన్నా.. కంటెంట్ ఉంటే ఆదిపురుష్ బాక్సాఫీస్ బద్దలు చేయడం పక్కా అంటున్నారు.