ట్రోలింగ్ అయినా.. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా.. ఆదిపురుష్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ఎందుకంటే.. బాహుబలి సెట్స్ పై ఉన్నప్పుడే.. సాహో, రాధే శ్యామ్ ఒప్పుకున్నాడు ప్రభాస్. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అందుకే ఆదిపురుష్(adipurush) పై భారీ అంచనాలున్నాయి. కానీ టీజర్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. అందుకే ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తోంది ఆదిపురుష్ టీమ్.
అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఆదిపురుష్ నుంచి మరో టీజర్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అలాగే సాంగ్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఫైనల్‌గా ఆదిపురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు సమాచారం. రేపో మాపో దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్, అతుల్ పాటలు కంపోజ్ చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోను ఉంది.
ఇకపోతే.. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా. విజువల్ వండర్‌గా రాబోతోంది. కాని గ్రాఫిక్స్ ఊహించిన స్థాయిలో లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ‘ఆదిపురుష్’ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.