ఆదిపురుష్ ఆరు నెలలు పోస్ట్ పోన్ చేయడంతో.. మేకర్స్ పై మండిపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ సలార్ పై పడనుందని తెలుస్తుండడంతో.. మరింత ఫైర్ అవుతున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అవడంతో.. ఒక్క హిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
కానీ ప్రభాస్ కొత్త సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండడం.. అభిమానులను కలవరపెడుతోంది. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని జనవరి 12 నుంచి.. 2023 జూన్ 16కి పోస్ట్ పోన్ చేశారు. అయితే సలార్ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆదిపురుష్ కారణంగా సలార్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముందుగా ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకొని.. లాంగ్ గ్యాప్‌తో సలార్ డేట్ లాక్ చేశారు.
అయితే ఇప్పుడు ఆదిపురుష్ రీషూట్ కారణంగా సలార్ మరింత డిలే అయ్యే అవకాశం ఉంది. పైగా గ్యాప్ తక్కువగా ఉండడంతో.. ‘సలార్’ను కూడా వాయిదా వేసే ఆలోచలనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2023 చివరికి లేదంటే.. 2024 సంక్రాంతికి ‘సలార్’ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీని వల్ల ప్రాజెక్ట్ కె పై కూడా ఎఫెక్ట్ పడనుంది. మొత్తంగా ఇప్పుడు ఆదిపురుష్ దెబ్బకు సలార్, ప్రాజెక్ట్ కె మరింత వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఆదిపురుష్..
ప్రభాస్ మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌ను డైలమాలో పడేసిందని చెప్పొచ్చు. మరి సలార్, ప్రాజెక్ట్ కె ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయో చూడాలి.