దగ్గుబాటి అభిరామ్ తెరంగ్రేటం చేసిన మూవీ అహింస.. గీతికా తివారి హీరోయిన్గా నటించింది. సదా, రజత్ బేడీ, కమల్ కామరాజు, రవి కాలే తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అహింస మూవీ ఈ రోజు విడుదలైంది.
Abhiram Ahimsa Movie Review: దగ్గుబాటి అభిరామ్ తెరంగ్రేటం చేసిన మూవీ అహింస.. ఈ రోజు సినిమా విడుదలైంది. గీతికా తివారి హీరోయిన్గా నటించింది. సదా, రజత్ బేడీ, కమల్ కామరాజు, రవి కాలే తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించగా.. తేజ డైరెక్ట్ చేశారు.
సినిమా:అహింస నటీనటులు: దగ్గుబాటి అభిరామ్, గీతిక, సదా, కమల్ కామరాజు సినిమాటోగ్రఫీ:సమీర్ రెడ్డి ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం: ఆర్పీ పట్నాయక్ నిర్మాత: పి. కిరణ్ దర్శకత్వం: తేజ విడుదల తేదీ:02 జూన్
కథ:
రఘు (అభిరామ్)కు పేరంట్స్ లేరు. పేద రైతు. అత్త, మామలే పెంచి, పెద్ద చేస్తారు. అతను అహింస సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అతని మరదలు అహల్య (గీతికా తివారి) బావ రఘు అంటే ఇష్టం. రఘుకు కూడా ఆమె అంటే ఇష్టమే. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఇంతలో దుష్యంత్ రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు ఎంట్రీ ఇస్తారు. బావకు టిఫిన్ ఇచ్చి వస్తోండగా అలేఖ్యను రేప్ చేస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అహల్యను రఘు ఆస్పత్రిలో చేరుస్తాడు. అతనికి అండగా లేడీ లాయర్ లక్ష్మీ (సదా), ఆమె భర్త ఉంటారు. డబ్బు, పలుకుబడి ఉపయోగించి కేసు నీరుగార్చాలని దుష్యంత్ రావు చూస్తాడు. సాక్ష్యాలను తీసుకొచ్చి, కేసును అనుకూలంగా మార్చేందుకు రఘు ప్రయత్నిస్తాడు. ఇంతలో చటర్జీ ఎంట్రీ కావడంతో అంత తారుమారు అవుతుంది. అహింసను నమ్మే రఘు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. వారికి న్యాయం జరుగుతుందా..? దుష్యంత్ రావు పరిస్థితి ఏంటో తెలియాలంటే అహింస మూవీ చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
రఘుకు సాయం చేసిన లాయర్ లక్ష్మీ, ఆమె భర్తను దుష్యంత్ రావు చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగదని భావించి.. రఘు హింసను ఎంచుకుంటాడు. అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్ రఘుని ఎందుకు చంపాలని ప్రయత్నించింది. దుష్యంతరావు కనబడకుండా పోతారనే అంశాల కాస్త సస్పెన్స్ పెంచుతాయి. మూవీ సాగదీసినట్టు అనిపిస్తోంది. తేజ రోటిన్ మూవీ లానే ఉంది తప్ప కొత్తదనం లేదు. కానిస్టేబుల్ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం ఇవ్వడం, కోర్టులో హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఏ ఒక్కటి రియలిస్టిక్‌గా ఉండదు. సెకాండఫ్‌లో వచ్చే ఐటెమ్ సాంగ్ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని సాంగ్ చేయించడం ఏంటీ అంటున్ానరు.
ఎవరెలా చేశారంటే..?
తొలి సినిమా అయినప్పటికీ అభిరామ్ న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. కొన్నిచోట్ల అనుభవ లేమి కనిపించింది. గీతికా తివారి మెప్పించింది. పోలీస్ అధికారిగా కమల్ కామరాజు, లాయర్‌గా సదా తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ రజత్ బేడీ, ఛటర్జీ, ఇతరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాల పనితీరు
ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఫర్లేదు. ఉందిలే పాట మినహా ఇతర పాటలు ఆకట్టుకోలేదు. బ్లాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. చాలా రోజుల తర్వాత తేజతో ఆర్పీ పట్నాయక్ జోడీ కట్టారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి.. సెకండాఫ్‌లో సన్నివేశాలను క్రిస్పీగా కట్ చేయాల్సి ఉండే.. నిర్మాణ విలువలు మూవీకి తగినట్టు ఉన్నాయి.
ప్లస్
అభిరామ్, గీతిక నటన
నేపథ్య సంగీతం
ఫస్టాప్ స్క్రీన్ ప్లే
మైనస్
రొటిన్ లవ్ స్టోరీ
సెకండాఫ్ స్లో నెరేషన్
ఐటెమ్ సాంగ్