స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో రాణిస్తోంది. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్. గతంలో నాకు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. దాంతో నేను మానసికంగా చాలా కుంగిపోయా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టా. నా కుటుంబం, స్నేహితులు నాకు చాలా అండగా నిలబడ్డారు. వారే నా బలం’ అని పేర్కొంది.