AP: YCP కార్యకర్తలపై ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అంటూ ఆ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. సోషల్ మీడియాలో TDP వారు పెట్టిన అసభ్యకర పోస్టులపై ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.