ASR: అరకులోయ మండలం, పెదలబుడు గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం జరిపారు. ఈ మేరకు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం.కృష్ణవేణి, ఉపాద్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన దేశ ప్రథమ ప్రధాని నెహ్రు జయంతి పురష్కరించుకొని నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారని వివరించారు. ఇందులో ఉపాధ్యాయులు సింహాచలం, శ్రీనివాసరావు ఉన్నారు.