AP: విశాఖపట్నంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడికి దిగాడు. యువతి ఇంటికి వెళ్లిన నీరజ్ శర్మ ఇనుప రాడ్డుతో దాడిచేశాడు. తీవ్రగాయాలవ్వడంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పెదగంట్యాడ మండలం బీసీరోడ్లో చోటు చేసుకుంది. దాడి అనంతరం నిందితుడు నీరజ్ శర్మ పరార్ అయ్యాడు.