TG: హైదరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయని, హైదరాబాద్ చుట్టూ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలు చూస్తుంటే ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. పెట్టుబడుల నుంచి విచిత్రమైన నాయకత్వం వస్తోందని ఆరోపించారు.