TG: బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని అన్నారు. మాజీమంత్రి కేటీఆర్కు ఇంకా కొవ్వు తగ్గలేదు, అందుకే కలెక్టర్ మీద దాడి చేయించారని పేర్కొన్నారు. గతంలో తనపై జరిగిన దాడిలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కొవ్వు కరిగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.