TG: కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటన విచారణలో పోలీసులు వేగం పెంచారు. పరిగి స్టేషన్కు అడిషనల్ డీజీ మమేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఈ దాడిలో అసలు సూత్రధారులు ఎవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో సుమారుగా రెండు గంటల నుంచి విచారణ చేస్తూ ఉన్నారు.