TG: TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఈనెల 16 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు. 18న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. అలాగే, లగచర్ల ఘటన వెనుక కుట్ర కోణం ఉందని, దీని వెనుక BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.