బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన 3 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఈ మూవీ రూ.103కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించాయి. కాగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణ్వీర్ గూఢచారి పాత్రలో కనిపించాడు.