సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూవీగా రికార్డుకెక్కినట్లు పేర్కొన్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.