బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లెగసీని తక్కువ చేసి చుపించారంటూ పలువురు మండిపడ్డారు. ఈ మేరకు షోకు లీగల్ నోటీసులు కూడా అందాయి. అయితే ఈ షోతో సల్మాన్ ఖాన్ టీంకు సంబంధాలు ఉన్నాయంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన సల్మాన్ టీం.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాము ఆ షోతో మమేకం కాలేదని పేర్కొన్నారు.