పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. తాను చేసిన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. అల్లు అర్జున్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని, పుష్ప-2 విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని, నిర్మాతలకు మంచి జరగాలన్నాడు. కళాకారుల కష్టానికి తగిన ఫలితం రావాలని చెప్పాడు.