పాకిస్తాన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నటి మల్లికా షెరావత్కు ఈడీ సమన్లు జారీ చేసింది. హీరోయిన్లు మల్లికా, పూజా బెనర్జీ వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. పోర్టల్ ‘మ్యాజిక్‌విన్(MagicWin)’ చట్టవిరుద్ధంగా పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను ప్రసారం చేసింది. ఈ పోర్టల్‌పై దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ఇటీవల ఢిల్లీ, ముంబై సహా పూణేలలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.