రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కాంబోలో ‘రౌడీ జనార్ధన’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి భాగం కానున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్ర కోసం ఆమెతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు.