Avika Gor: భయపెట్టడానికి సిద్దమైన అవికా గోర్… ‘1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్’ ట్రైలర్ రిలీజ్
హీరోయిన్ అవికా గోర్ నటించిన '1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horror Of The Heart) అనే మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. ఈ సినిమాతో అవికా బాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
హీరోయిన్ అవికా గోర్(Heroine Avika Gor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ రాజ్ తరుణ్(Raj Tarun)తో ‘ఉయ్యాల జంపాల’ సినిమా(Uyyala Jampala Movie)తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారిగది3’ వంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. టాలీవుడ్(Tollywood)లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే ‘పాప్ కార్న్’ అనే మూవీ(Popcorn)తో వచ్చి విజయం సాధించడంలో విఫలం అయ్యింది.
‘1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్’ ట్రైలర్:
తాజాగా అవికా గోర్(Avika Gor) బాలీవుడ్(Bollywood)లోకి ఓ హర్రర్ ఫిలింతోటి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ దర్శకులు విక్రమ్ భట్(Vikram Bhatt) దర్శకత్వంలో ‘1920’ అనే సినిమా 2008లో వచ్చింది. ఆ మూవీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా ‘1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horrors Of the Heart) అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీలో అవికా గోర్ కథానాయికగా చేయనుంది. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
‘1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horror Of The Heart) అనే మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ ను కట్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ను విడుదల చేశారు. జూన్ 23న ఈ మూవీ హిందీతో పాటుగా తమిళం, తెలుగులో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో అవికా గోర్(Avika Gor) ‘రాజుగారి గది3’ అనే హర్రర్ మూవీలో దెయ్యంగా నటించి భయపెట్టిన సంగతి తెలిసిందే.