‘అఖండ 2’ ఇష్యూ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. నిన్నరాత్రి ఈరోస్ సంస్థతో 14రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ కోర్టులో ఈ సెటిల్మెంట్ విషయం తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న రిలీజ్, ఈ నెల 11న ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది.