ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విషెస్ తెలిపారు. ఈ మేరకు మూవీ నుంచి బన్నీ, రష్మికల పోస్టర్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.