NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి జొన్నవాడ కామాక్షమ్మ హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.