దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ‘వెలుగు జిలుగల ఈ దీపావళి, చీకటిని పారదోలి అందరి జీవితాల్లో కాంతిని నింపాలని ఆశిస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని చిరు ట్వీట్ చేశారు. ‘మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు’ అని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.