• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్తున్నారా?

చాలామందికి టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉండే ఈ-కోలై వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఫోన్ స్క్రీన్‌పైకి చేరుతుంది. చేతులు కడుక్కున్నా, ఫోన్ ద్వారా ఆ క్రిములు ఆహారంతో పాటు శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అంతేకాక, ఫోన్ చూస్తూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే అవకాశం ఉంది.

February 20, 2026 / 04:00 PM IST

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే అద్భుత లాభాలు

స్ట్రాబెర్రీలు తక్కువ కేలరీలు, అధిక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగిన అద్భుతమైన పండ్లు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. బరువు తగ్గడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు కొన్ని పండ్లు తింటే మెదడును చురుగ్గా ఉంచుతాయి. శరీరంలో వాపు తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.

February 20, 2026 / 01:31 PM IST

లంచ్ తర్వాత స్వీట్స్ తింటున్నారా?

చాలామందికి భోజనం తర్వాత తీపి తినడం అలవాటు, కానీ దీనివల్ల అనవసరమైన క్యాలరీలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరతో చేసిన స్వీట్లకు బదులుగా ఒక చిన్న ముక్క బెల్లం తినడం ఉత్తమం. ఇది ఆహారం త్వరగా అరిగేలా చేయడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఐరన్ అందిస్తుంది. రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యంతో పాటు తీపి కోరికను కూడా ఇది తీరుస్తుంది.

February 20, 2026 / 01:05 PM IST

ALERT: మీ ఏసీని క్లీన్ చేశారా..?

వేసవి ఎండలు మొదలైన నేపథ్యంలో ఏసీలు ఆన్ చేసే సమయం వచ్చేసింది. అయితే వీటిని ఉపయోగించే ముందు ఫిల్టర్లను శుభ్రపరచడం తప్పనిసరి. మొదట విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఫిల్టర్లను జాగ్రత్తగా తొలగించాలి. అనంతరం వాటిని నీటితో కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి అమర్చాలి. దీనివల్ల ఏసీ పనితీరు మెరుగుపడటమే కాకుండా, గాలి నాణ్యత పెరిగి విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

February 20, 2026 / 12:55 PM IST

నానబెట్టిన నల్ల కిస్మిస్ తింటున్నారా?

మహిళల ఆరోగ్యానికి నానబెట్టిన నల్ల కిస్మిస్ అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, హార్మోన్ల ఉత్పత్తి బ్యాలన్స్ అవుతుంది. ముఖ్యంగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా మారడమే కాక, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. అయితే రాత్రి 6-10 ద్రాక్షలను నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే మంచిది.

February 20, 2026 / 10:43 AM IST

శవాసనంతో బోలెడన్ని లాభాలు..​!

యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. దీనికి శవంలా పడుకుంటే చాలు. శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

February 20, 2026 / 08:35 AM IST

పురుషుల్లో క్షీణిస్తున్న’Y’ క్రోమోజోమ్

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల ‘Y’ క్రోమోజోమ్‌ను ఎక్కువగా నష్ట పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉందట. 60 ఏళ్లు పైబడిన పురుషులలో ‘Y’ క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని అంచనా వేశారు.

February 20, 2026 / 12:59 AM IST