fasting benefits : ఈ మధ్య కాలంలో చాలా మంది ఉపవాసం, ఇంటర్మిటెన్ పాస్టింగ్ లాంటి పద్ధతులను బరువు తగ్గేందుకు ఉపయోగిస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లు కూడీ వీటిని ఫాలో అవుతుండటంతో ఇప్పుడు చాలా మంది ఉపవాసం పై దృష్టి సారిస్తున్నారు. మరి ఇది తినడం వల్ల బరువు కచ్చితంగా తగ్గవచ్చా? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఉపవాసం(fasting) చేయాలనుకునే వారు నిర్దిష్ట సమయం పాటు ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఇలా ఏమీ తినకుండా ఉండేవారూ ఉన్నారు. ఇంకొందరేమో ఇంటర్మిటెన్ పాస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే రోజులో ఎనిమిది గంటల పాటు తినడం, పదహారు గంటల పాటు ఏమీ తినకుండా ఉండటం.. లాంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు.
ఇలాంటి తరహా ఉపవాసాలు చేయడం వల్ల శరీరంలోని కణాలకు శక్తిని ఇచ్చేందుకు బయట నుంచి ఆహారం అందదు. కాబట్టి శరీరంలో కొవ్వుల రూపంలో ఉన్న వాటిని బర్న్ చేసి శరీరం శక్తిని తీసుకుంటూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల మొత్తం శరీరం ప్రభావితం అవుతుంది. మెదడు పనితీరు, సామర్థ్యం మెరుగుపడతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఆకలి కూడా మెరుగవుతుంది. అలాగే శరీరంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయి కాబట్టి బరువూ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అతి అనర్థం అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. వారానికి ఒకసారి పాస్టింగ్ చేయడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.