బరువు పెరుగుట
చాలా తక్కువ కాలం మాత్రమే ప్రోటీన్ తీసుకుంటే బరువు తగ్గుతారు. కానీ, ఆ తర్వాత శరీరంలో పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. ప్రోటీన్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
నోటి దుర్వాసన
ప్రోటీన్ లో ఉండే కెటోసిన్ అనే సమ్మేళనం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది.
డీహైడ్రేషన్
శరీరం డీహైడ్రేటెడ్ గా మారుతుంది. మూత్రపిండాలు మూత్రం ద్వారా అధిక ప్రోటీన్ ని బయటకు పంపించడానికి రెండు రెట్లు అదనంగా కష్టపడతాయి. దాహం ఎక్కువగా వేస్తుంది.
ప్రేగు సమస్యలు
అధిక ప్రోటీన్ ఆహారాలు ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాను నాశనం చేస్తాయి.
మలబద్ధకం, అతిసారం, కడుపులో తిమ్మిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
పోషకాహార లోపం
శరీరం అదనపు ప్రోటీన్లను స్వీకరిస్తే, అది కాలేయం, మూత్రపిండాలు, ఎముకలపై జీవక్రియ ఒత్తిడికి దారితీస్తుంది.
ఈ అవయవాల నుండి పోషకాలను బయటకు తీయడానికి దారితీస్తుంది.
మొత్తం జీవ పోషక సమతుల్యతను తగ్గిస్తుంది.
రెడ్ మీట్ లాంటి ప్రోటీన్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ముఖ్య విషయాలు
ప్రోటీన్ ఎంత తీసుకోవాలో డాక్టర్ తో మాట్లాడి నిర్ణయించుకోవాలి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
శరీరానికి అవసరమైనంత నీరు తాగాలి.
ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా తీసుకోవాలి.