shardul thakur:శార్దూల్ ఠాకూర్ (shardul thakur) ఈడెన్ గార్డెన్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ (half century) చేశాడు. ఆరు ఫోర్లు, 3 సిక్సులతో అర్ధ శతకం పూర్తిచేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ అంత విఫలమైన వేళ శార్దూల్ (shardul) రెచ్చిపోయాడు. ఓపెనర్ గుర్బాజ్ ఒక్కడే 57 పరుగులతో రాణించాడు. రింకు సింగ్ కూడా 46 పరుగులు చేశాడు. మిగిలిన వారు అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 89 పరుగులకే కోల్ కతా 5 వికెట్లను కోల్పోయింది. శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్‌తో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది.
రాయల్ చాలెంజర్స్ బౌలింగ్‌లో విల్లే, శర్మ చెరో 2 వికెట్లను తీశారు. సిరాజ్, బ్రేస్ వెల్, హర్షల్, పటేల్ తలో వికెట్ తీశారు. గత మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిపించిన విరాట్ కోహ్లి (KOHLI) ఈ రోజు మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఈ నెల 2వ తేదీన ముంబై ఇండియన్స్‌తో (MI) జరిగిన మ్యాచ్‌లో కోహ్లి పరుగుల వరద పారించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి.. జట్టును గెలిపించాడు. ఈ రోజు కోల్ కతాపై అదే దూకుడు చూపాలని అభిమానులు కూడా కోరుతున్నారు.