నేటి ఐపీఎల్(IPL 2023) మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super kings), ముంబయి ఇండియన్స్(Mumbai Indians) మధ్య హోరాహోరి పోరు జరిగింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni) నాయకత్వంలోని సీఎస్కే(CSK) టీమ్ 6 వికెట్ల తేడాతో ముంబయిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల పోగొట్టుకుని 139 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) జట్టు 17.4 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. సీఎస్కేలో ఓపెనర్లు డెవాన్ కాన్వే 44, రుతురాజ్ 30, రహానే 21 పరుగులు చేశారు. ధోనీ ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చి ఓ సింగిల్ తీయడంతో మ్యాచ్ ముగిసింది.
ముంబయి ఇండియన్స్(Mumbai Indians) జట్టు బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 2, స్టబ్స్ 1, ఆకాష్ 1 వికెట్ ను పడగొట్టారు. ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో చేరింది. సీఎస్కే(Chennai Super kings) ఇప్పటి వరకూ 11 మ్యాచులు ఆడగా అందులో 6 విజయాలు మాత్రమే సాధించింది. ఇకపోతే ముంబయి ఇండియన్స్ 10 మ్యాచులు ఆడగా 5 సార్లు గెలిచింది.