స్టార్ జావెలిన్ త్రో భారత ఆటగాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి అదరగొట్టాడు. నిన్న దోహా డైమండ్ లీగ్లో మొదటి స్థానంలో నిలిచి తాజాగా ఇంకోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ(modi) ట్వీట్ చేసి అభినందించారు.
దోహాలో జరిగిన 2023 వాండా డైమండ్ లీగ్(Diamond League)లో ప్రముఖ ఆటగాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(modi) శనివారం అతనిపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.
ఈ సంవత్సరంలో మొదటి ఈవెంట్లోనే మొదటి స్థానం కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. 88.67 మీటర్ల ప్రపంచ లీడ్ త్రోతో చోప్రా(Neeraj Chopra)దోహా డైమండ్ లీగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారని వెల్లడించారు. ఈ క్రమంలో అభినందనలు తెలియజేశారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి ప్రదర్శన కనబర్చాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
First event of the year and first position!
With the World lead throw of 88.67m, @Neeraj_chopra1 shines at the Doha Diamond League. Congratulations to him! Best wishes for the endeavours ahead. pic.twitter.com/UmpXOBW7EX
ఒలింపిక్ ఛాంపియన్ పురుషుల జావెలిన్ త్రోలో తన తొలి ప్రయత్నంలోనే 88.67 మీటర్ల దూరం నమోదు చేసి డైమండ్ లీగ్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈ క్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(anurag thakur) కూడా నీరజ్ చోప్రాను మెచ్చుకున్నారు.
అనురాగ్ ఠాకూర్ ట్వీట్(twitter)లో నీరజ్ చోప్రా మెరుపు వేగంతో కూడిన 88.67 మీటర్ల త్రోతో అతను దోహా డైమండ్ లీగ్లో ఆధిపత్యం సాధించి ఇంటికి కీర్తి తెచ్చాడని పేర్కొన్నారు. దేశం మళ్లీ గర్వపడేలా చేసిన నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు నీరజ్ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన గమ్యాన్ని వదలకుండా సమయాన్ని వృథా చేయలేదని అన్నారు.
Neeraj Chopra wins! 🇮🇳
With a thunderous throw of 88.67m, he dominated the Doha Diamond League and brought glory home. A true champion who has made the nation proud again.