»Vivek Ramaswamy Was Challenged To Surf In A Suit This Happened
Vivek Ramaswamy: వివేక్ రామస్వామి సర్ఫింగ్..వైరల్ వీడియో
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతీకి చెందిన వివేక్ రామస్వామి నీటిపై సర్ఫింగ్ చేశారు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్తో కలిసి చేసిన ఈ సాహాసం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై మీ కామెంట్ తెలియజేయండి మరి.
Vivek Ramaswamy: 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఈరోజు సర్ఫింగ్ చేయడం నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్(kazsawyer)తో కలిసి రామస్వామి ఈ ఫీట్ చేశారు. “కాబోయే ప్రెసిడెంట్కిి సర్ఫింగ్ చేయడం ఎలాగో నేర్పించడం” అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు సాయర్. గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోయాడు. తరువాత నేర్పుగా ప్రయత్నించి నేర్చుకున్నాడు. నీటిపై సంతోషంగా స్వారీ చేశాడు. తరువాత సాయర్ మరో సావాల్ను విసిరాడు. రామస్వామి వేసుకున్న సూట్తోనే స్వారీ చేయాలని తెలుపగా అది కూడా చేసి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియోను సాయర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా ఇప్పటికే 7 లక్షల 50 వేల మంది విక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న వారిలో సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు US విదేశాంగ విధానంపై చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో వివేక్ రామస్వామి నిక్కీ హేలీని డిక్ అని వ్యక్తిగతంగా విరుచుకుపడ్డాడు. దాంతో అభ్యర్థుల మధ్య విబేధానికి తెరతీసింది. తరువాత కాలిఫోర్నియాలో తదుపరి చర్చలో మరింత తీవ్రమైంది. ఇక 2024 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభ్యర్థులు అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు.