USA: విమానం రద్దయితే ఆటోమెటిక్‌ రిఫండ్ వచ్చేలా అమెరికాలో కొత్త నిబంధనలు

కొన్నిసార్లు విమానాలు రద్దు అయితే రిఫండ్ రాదు. అయితే విమానం రద్దు అయిన, మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండా రిఫండ్ ఇచ్చేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 11:29 AM IST

USA: కొన్నిసార్లు విమానాలు రద్దు అయితే రిఫండ్ రాదు. అయితే విమానం రద్దు అయిన, మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండా రిఫండ్ ఇచ్చేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణికుల విమానం రద్దు అయిన, మళ్లింపు అయిన సమాయాల్లో ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వాళ్లకి అందించాల్సిన రిఫండ్ ఆటోమేటిక్‌గా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వాళ్లకి ఏడు పనిదినాల్లో రిఫండ్ వస్తుంది. మిగతావారికి 20 రోజుల్లో రిఫండ్ చేయాలి. అంతే కాని వోచర్లు, ట్రావెల్ కార్డులు, ఇతర రూపంలో పరిహారం ఇవ్వడానికి వీలులేదు.

ఇది కూడా చూడండి: Pawan Kalyan: సీఎంను మార్చాల్సిన సమయమిది!

ప్రయాణికులు అడిగితే కోరుకున్న విధంగా ఇవ్వచ్చు. లగేజీ, రిజర్వేషన్ మార్పు లేదా రద్దుపై ఎంత తీసుకుంటారో ముందే తెలియజేయాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆయా ఫీజులను నేరుగా కనిపించేలా చూపించాలి. లగేజి బరువు, పరిమాణం బట్టి ఛార్జీలు వేర్వేరుగా చూపించాలి. రిజర్వేషన్ మార్పు, రద్దుకు సంబంధించిన నిబంధనలను తెలియజేయాలి. కొన్ని సేవలు పేరుతో విమానయాన సంస్థలు అదనపు రుసుములు వసూలు చేస్తున్నాయి. వీటిన్నింటికి చెక్ పెట్టడం కోసమే అమెరికా ఈ నిబంధనలు తీసుకొచ్చింది.

ఇది కూడా చూడండి: Ayesha Rashan: పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె!

Related News

Dubai: వర్షాల కారణంగా.. భారత్, దుబాయ్‌ల మధ్య విమానాల రద్దు

దుబాయ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా దుబాయ్ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.