దిగ్గజ పారిశ్రామిక వేత్త, టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మంత్లీ యూజర్ల సంఖ్య 540 మిలియన్లను దాటినట్లు చూపుతున్న గ్రాఫ్‌ను షేర్ చేశారు. ఎక్స్’(X)గా పేరు మారిన ట్విటర్ (Twitter) రికార్డ్ సృష్టించింది. గత అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి ముందు 2022 మే నాటికి ట్విటర్ 229 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉండగా తన ఆధీనంలోకి వచ్చాక 2022 నవంబర్‌లో 259.4 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లుఎలాన్ మస్క్ (Elon Musk) పోస్ట్ చేశారు.తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ ట్విటర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు.
బ్లూటిక్(Bluetic)ను పెయిడ్ సర్వీస్‌గా మార్చారు. అస్తవ్యస్తమైన మార్పుల ఫలితంగా ప్రకటనల ఆదాయం క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత మేలో ఎన్బీసీ యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న లిండా యాకారినోను ట్విటర్ (ఎక్స్)కు సీఈవోగా నియమించారు. తద్వారా తనకు సబ్స్క్రిప్షన్ (Subscription) రాబడితోపాటు ప్రకటనల ఆదాయం కూడా కీలకమని సంకేతాలిచ్చారు. అయితే మెటా, మైక్రోసాఫ్ట్(Microsoft)తోపాటు మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ‘ఎక్స్’ అక్షరంపై మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్నాయి. కాబట్టి దీనిపై చట్టపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.