South Korea: మస్క్ పేరుతో మస్కా కొట్టిన సైబర్ నేరగాడు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరుతో సైబర్ నేరగాడు ఓ యువతికి మస్కా కొట్టాడు. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షలు పోగొట్టుకుంది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 04:41 PM IST

South Korea: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరుతో సైబర్ నేరగాడు ఓ యువతికి మస్కా కొట్టాడు. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర చదివి.. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యింది. అయితే ఆమెకు ఓసారి మస్క్ పేరుతో ఉన్న ఖాతాకు ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేశారు. ఫస్ట్ ఆమెకు డౌట్ వచ్చింది. కానీ తర్వాత అతను చేసే వర్క్ డిటైల్స్ పెట్టడం చేయడంతో నమ్మాను. అలాగే మీటింగ్ గురించి కూడా చెప్పేవాడు.

ఇది కూడా చూడండి: Malaria Fever: మలేరియా జ్వరం వచ్చిందో లేదో గుర్తించేదెలా..?

ఒకసారి వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నానని చెప్పాడంట. అయితే ఆ సైబర్ నేరగాడు ఆ కాల్‌ను ఏఐ డీపీ‌ఫేక్ సాంకేతికను ఉపయోగించి మాట్లాడినట్లు తెలిపింది. అలా తన కొరియన్ ఉద్యోగుల కోసం డబ్బు పంపేలా ఆమెను ఒప్పించాడు. డబ్బును పెట్టుబడిగా పెట్టి ధనవంతురాలిని చేస్తానని నమ్మించాడు. తన అభిమానులు ధనవంతులుగా మారితే తనకు సంతోషమని తెలిపాడు. ఆ మాటలు నమ్మి ఆమె డబ్బు పంపింది. ఇలా రూ.41 లక్షలు పోగొట్టుకుందని తెలిపింది. ఇలాంటి తరహా మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇది కూడా చూడండి: DibangValley: అరుణాచల్​, చైనా బార్డర్‌లో కొండ చరియలు విరిగిపడి హైవే తెగిపోయింది.. వీడియో వైరల్