»Artificial Diamonds Are Made In South Korea No Longer In 150 Minutes
Artificial Diamonds: ఇకపై 150 నిమిషాల్లో కృత్రిమ వజ్రాలు తయారు
ఆభరణాల తయారీ, ఫ్యాషన్ రంగంలో డైమాండ్స్కు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలుసు. అయితే వాటిని కృత్రిమ తయారు చేస్తున్నప్పటకీ దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. తాజాగా వాటన్నింటిని అధిగమించి కేవలం 150 నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాన్ని తయారు చేసే విధానాన్ని దక్షిణ కొరియాలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Artificial Diamonds: మగువలకే కాదు వజ్రాలు అంటే మగవారికీ ప్రీతీనే. భూమ్మీద సహజంగా లభించే వాటిలో వజ్రం చాలా విలువైనది. ఆభరణాల తయారీలో, ఫ్యాషన్ రంగంలో డైమాండ్కు డిమాండ్ ఎక్కవ అన్న సంగతి అందరికీ తెలుసు. ఇది చాలా దృఢమైన కనిజం. భూమి పొరల్లో దాగిని ఈ విలువైన కనిజం ఎలా తయారు అవుతుందో తెలుసు. వేల సంవత్సరాలు అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద ఉన్న కార్బన్ వజ్రం. కార్బన్ వజ్రంగా ఎలా మారుతుందో తెలిసిన పరిశోధకులు దాన్ని కృత్రిమంగా కూడా తయారు చేశారు. కానీ ఫ్యాషన్ రంగంలో సహజ డైమాండ్కే ఎక్కువ విలువ ఉంటుంది. వినియోగ దారుల ఆసక్తి మేరకు ఆర్టిఫిషల్గా తయారు చేస్తున్న డైమాండ్స్కు కూడా భారీగానే విలువ ఉంది.
అయితే భూమిలోంచి వెలికి తీసిన రాయిని వజ్రంగా మార్చేందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కోసి, సానబెట్టాల్సి ఉంటుంది. ఈ విధానానికి చాలా రోజులు పడుతుంది. ఇక వజ్రాల వినియోగం దృష్ట్యా వజ్రాలను కృత్రిమంగా తయారు చేస్తున్నారు. దీనిలో కూడా అదే సమస్య తలెత్తింది. ల్యాబ్లో వీటిని తయారు చేయడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ పద్దతిని దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు వేగవంతం చేశారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే సరికొత్త విధానాన్ని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతో తయారు చేయడం విశేషం. దక్షిణ కొరియాలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు చెందిన పరిశోధకులు ఈ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. దీంతో పరిశ్రామిక అవసరాలకు వజ్రాలు విరివిగా దొరకనున్నాయి.
ఇది వరకు అధిక పీడనంలో ద్రవ లోహలను కార్బన్ అణువులను కలపేవారు. ఇప్పుడు గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్లో వేడి చేస్తారు. దీని వలన కార్బన్ అణువులు స్పటికలుగా ఏర్పడుతాయి. ఈ విధానంలో 15 నిమిషాల్లోనే డైమండ్ సీడ్స్ తయారవుతాయి. మొత్తం ఈ ప్రాసెస్కు కేవలం 150 నిమిషాలు మాత్రమే పడుతుందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో వజ్రాలు వివిధ రంగాలకు అందుబాటులో ఉంటాయని దక్షిణ కొరియా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.