ఆకాశంలో మూడు రోజుల పాటు శనిగ్రహం కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నేటి నుంచి మరో రెండు రోజుల పాటు శనిగ్రహం భూమికి అతి దగ్గరగా రానుంది. రాత్రివేళలో కళ్లతో ఈ గ్రహాన్ని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆకాశంలో శనిగ్రహం (Saturn Planet) కనిపించనుంది. భూమి(Earth)కి చేరువగా ఆ గ్రహం రానున్నది. దాదాపు మూడు రోజుల పాటు శనిగ్రహం ఆకాశంలో కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆదివారం నుంచి ఈ నెల 30వ తేది వరకూ కూడా శనిగ్రహం ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించనుంది. కంటితోనే ఈ గ్రహాన్ని చూసే వీలుందని, అయితే టెలీస్కోప్, స్పేస్ బైనాక్యూలర్స్తో ఆ గ్రహాన్ని మరింత స్పష్టంగా చూసే వీలుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇలా గ్రహం కనిపించడాన్ని శాస్త్రవేత్తలు (scientists) శాటర్న్ అపోజిషన్ అని పిలుస్తారు. రెండు గ్రహాలు సూర్యుడి (Sun) చుట్టూ తిరుగుతుండే సమయంలో పూర్తిగా వ్యతిరేక దశకు చేరుకోవడాన్ని అపోజిషన్ అని అంటారు. శని-సూర్యుడికి మధ్యన భూమి వచ్చిన సమయంలో ఈ గ్రహం ఏర్పడుతుంది. శని గ్రహం (Saturn Planet) సూర్యునికి 889 మిలియన్ మైల్స్ దూరంలో ఉంటే భూమికి దగ్గరగా వచ్చిన టైంలో మాత్రం సూర్యుడికి, శనిగ్రహానికి మధ్య దూరం 746 మిలియన్ మైల్స్కి తగ్గిపోతుంది.
రాత్రి వేళలో కళ్లతో చూసినప్పుడు శనిగ్రహం (Saturn Planet) మిలమిల మెరుస్తూ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి రేడియస్ 6,378.1 చదరపు కిలోమీటర్లు కాగా శని రేడియస్ 36,183.7 చదరపు కిలోమీటర్లని, భూమితో పోలిస్తే తొమ్మిది రెట్లు రేడియస్ అధికంగా శనిగ్రహంలో ఉన్నట్లు తెలిపారు. ఈ శనిగ్రహాన్ని నేరుగా చూడాలంటే రాత్రి 8.30 గంటల తర్వాత దక్షిణ ఆగ్నేయం వైపు చూడాలని, ఆగస్టు 30వ తేది వరకూ ఈ గ్రహం కనిపిస్తుంందని వెల్లడించారు.