Oscar Celebrations : భారీగా RRR ఆస్కార్ సెలబ్రేషన్స్ ఈవెంట్!
RRR Oscar : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా సంచలనాలు సృష్టిస్తునే ఉంది. లాస్ట్ ఇయర్ మార్చి 25న రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా రాబట్టి.. టాప్ త్రీలో నిలిచింది. ఇక అవార్డ్స్ విషయంలో ట్రిపుల్ ఆర్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా సంచలనాలు సృష్టిస్తునే ఉంది. లాస్ట్ ఇయర్ మార్చి 25న రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా రాబట్టి.. టాప్ త్రీలో నిలిచింది. ఇక అవార్డ్స్ విషయంలో ట్రిపుల్ ఆర్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాదాపుగా అంతర్జాతీయ అవార్డులన్నీ ఈ సినిమాకు వరించాయి. అత్యున్నత పురస్కారం ఆస్కార్ కూడా వరించింది. ఈ క్రెడిట్ అంతా దర్శక ధీరుడు రాజమౌళికే సొంత. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన జక్కన్న.. ట్రిపుల్ ఆర్ మూవీతో ఇండియన్ సినిమాలను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఏకంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని.. చరిత్ర సృష్టించాడు. ఇక ఆస్కార్ వేడుక అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ మహేష్ బాబు ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారు రాజమౌళి. రేపో, మాపో అమెరికా నుంచి తిరిగి రానున్నారు. ఇక్కడ జక్కన్నకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. అలాగే భారీ ఈవెంట్ ప్లానింగ్‌లో ఉన్నారు. ఆస్కార్ అవార్డు వచ్చిన శుభ సందర్భాన్ని సంబరంలా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు నిర్మాత సురేష్ బాబు. ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ఈవెంట్ ఉంటుందని అన్నారు. వాస్తవానికైతే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సమయంలోనే రాజమౌళితో ఓ ఈవెంట్ ప్లాన్ చేద్దామని చెప్పారట. కానీ ‘ఆస్కార్’ కూడా వచ్చాక ప్లాన్ చేద్దాం.. అని అన్నారట రాజమౌళి. అనుకున్నట్టే ఇప్పుడు ‘ఆస్కార్’ అందున్నారు కాబట్టి.. త్వరలోనే ఒక బిగ్ ఈవెంట్ ఉంటుందని చెప్పొచ్చు. అతి త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.