PM Modi Bhutan Visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం భూటాన్ చేరుకున్నారు. శనివారం తిరిగి భారత్కు రానున్నారు. ఈ ఉదయం తొమ్మిది గంటల సమయంలో భూటాన్(Bhutan) రాజధాని థింపూలోని పారా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు.
భూటాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మోదీ(Modi) అక్కడకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్కడ అడుగు పెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాన మంత్రి షరింగ్ తోబ్గే ఆయనకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం మోదీ(Modi) భూటాన్ రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తానని తెలిపారు.
ఈ రెండు రోజులు బూటాన్లో జరగబోయే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. భూటాన్ కింగ్ ది ఫోర్త్ డ్రక్ గ్యాల్పో, ప్రధాని షెరింగ్ తోబ్గేతో చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మోదీ వాస్తవానికి గురువారమే భూటాన్ చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిన్న ఆ ప్రయాణం రద్దైంది.
VIDEO | PM Modi receives a ceremonial welcome as he arrives in Paro, #Bhutan.