»Kerala Woman Injured In Hamas Attack During Video Call With Husband
Israel-Hamas attack: భర్తతో వీడియో కాల్.. ఇంతలో దాడి, ఉలిక్కిపడ్డ కేరళ మహిళ
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు. ప్రతీగా ఇజ్రాయెల్ కూడా స్పందించింది. దాడుల్లో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్న 41 ఏళ్ల కేరళ మహిళ హమాస్ దుండగుల చేతిలో గాయపడింది.
Kerala woman injured in Hamas attack during video call with husband
Israel-Hamas attack: ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) మధ్య యుద్ధం జరుగుతోంది. కేరళకు చెందిన నర్సు ఇజ్రాయెల్ ఆసుపత్రిలో పనిచేస్తుంది. భారతదేశంలో ఉన్న భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్న షీజా ఆనంద్ (41), శనివారం తెల్లవారుజామున దాడి గురించి కుటుంబంతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. తాను క్షేమంగా ఉన్నానని చెప్పింది. ఆ తరువాత భర్తతో కాాల్ మాట్లాడుతుండగా పెద్ద శబ్ధం వినపడింది. అంతలో కాల్ కట్ కయింది. దీంతో ఇండియాలో ఉన్న కుటుంబం కంగారు పడింది. కేరళకు చెందిన మరో వ్యక్తి షీజా గాయపడినట్లు కుటుంబానికి ఫోన్ చేసి చెప్పాడు. ప్రమాదంలో గాయపడిందని, తాను శస్త్రచికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపాడు.
యుద్దం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు నివేదించాయి. అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు దోపిడీలు, దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పాలస్తీనా ఉగ్రవాదులు వ్యాన్‌లో కూతురిని చూశామని ఇజ్రాయెల్‌లో గల షానీ లైక్ అనే యువతి పేరంట్స్ చెబుతున్నారు. టాటుల ఆధారంగా నిర్ధారించుకున్నామని వివరించారు.
కేరళ(Kerala)కు చెందిన 200 మందికి పైగా బెత్లెహెమ్‌లో హోటల్లో చిక్కుకుపోయారు. వారంతా సురక్షితంగానే ఉన్నారు. కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్లో చిక్కుకుపోయారని తెలిసింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అక్కడి పరిస్థితిని వివరించారు. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా చనిపోయారు. యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌లోని 18 వేల మంది భారతీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.