Justin Trudeau And Wife Sophie: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)- సోఫి గ్రెగొరి ట్రూడో దంపతులు విడాకులు తీసుకున్నారు. తాము ఇద్దరం విడిపోతున్నామని సోషల్ మీడియా ఇన్ స్టలో పోస్ట్ చేశారు. జస్టిన్ ట్రూడో (Justin Trudeau)-సోపికి 2005లో పెళ్లి కాగా.. 18 ఏళ్లు కలిసి ఉన్నారు. తర్వాత విడిపోతున్నామని ప్రకటించారు.
2005లో వీరికి పెళ్లి కాగా.. తర్వాత పదేళ్లకు ట్రోడో (Justin Trudeau) ప్రధాన మంత్రి పదవీ చేపట్టారు. ట్రూడో తండ్రి పిర్రె ఎలియట్ ట్రోడో కూడా కెనడాకు ప్రధానిగా పనిచేశారు. 15 ఏళ్లు ఆ దేశ పీఎంగా పనిచేశారు. అంతకుముందు స్కూల్ టీచర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. పెళ్లి కాకముందు గ్రెగొరి ఎంటర్టైన్ మెంట్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు జస్టిన్ (Justin Trudeau) చిన్నప్పటి నుంచి తెలుసు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. క్సేవియర్, ఎల్లా గ్రేస్, హర్డిన్ అనే కిడ్న్ ఉన్నారు.
Justin Trudeau and wife Sophie separating after 18 years of marriage https://t.co/TjxHj40I1L
విడిపోకముందు బహిరంగంగా వారు ప్రేమను వ్యక్తం చేశారు. ఐక్యతను చూపారు. పుట్టిన రోజు, పెళ్లి రోజులో కలిసి ఉన్నారు. గత పదేళ్ల నుంచి వారి వైవాహిక జీవితంలో మెల్లి మెల్లిగా తేడాలు కనిపించడం ప్రారంభించాయి. దానికి సంబంధించి ఇద్దరూ పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. తమ జీవితంలో ఒడిదొడుకులు ఉన్నాయని.. అయినప్పటికీ కలిసే ఉన్నామని పేర్కొన్నారు. గ్రెగొరి తన బెస్ట్ ఫ్రెండ్, తన భాగస్వామి, ప్రేమ అని జస్టిన్ (Justin Trudeau) రాశారు. ఆ తర్వాత గ్రెగొరి కూడా రాశారు. మేం కష్టాలను ఎదుర్కొన్నాం.. ఇద్దరం కలలు కనేవారిగా ఉన్నాము, ఒక్కటిగా ఉండాలని అనుకున్నాం.. అని రాశారు.