»Indian American Vivek Ramaswamy Announces 2024 Us Presidential Bid
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష బరిలో కేరళ సంతతి…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిక్కీ హేలీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిక్కీ హేలీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలవనున్న రెండో నేత అయ్యారు. వీరిద్దరు కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే చేయనని, భావి తరాలకు కొత్త కలలను సృష్టించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. తాను అమెరికాకు మొదటి స్థానం ఇచ్చేందుకు సిద్ధమని, అంతకంటే ముందు అమెరికా అంటే ఏంటో తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా చైనా నుండి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తానని చెప్పారు.
వివేక్ రామస్వామి కేరళకు చెందిన వారు. 1985 ఆగస్ట్ 9న ఒహియోలోని సిన్సిన్నాతిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుండి అమెరికాకు వచ్చారు. హార్వార్డ్, యేల్ యూనివర్సిటీలలో విద్యను అభ్యసించారు. 2016 ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ఆయన ఆస్తుల వ్యాల్యూ 600 మిలియన్ డాలర్లు. తద్వారా నలభై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజినీర్. తల్లి జెరియాట్రిక్ సైక్రియాటిస్ట్.