మన దేశంలో బహుభార్యత్వం సమ్మతం లేదు. కానీ విదేశాల్లో ఎంత మందినైనా పెళ్లాడొచ్చు.. లేకుంటే పెళ్లి కాకుండానే కాపురం పెట్టవచ్చు. ఆ విధంగానే ఓ వ్యక్తి నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అందులో ఏం ప్రత్యేక ఉంది అంటారా? ఆయన తన పుట్టిన రోజు నాడే నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్పేనా అంటారా? ఆగండి ఇంకో ప్రత్యేక విషయం ఉంది. ఆయన ఎవరో కాదు చందమామపై నడిచిన వ్యక్తి. జాబిల్లిపై తొలిసారి కాలు మోపింది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. కానీ అతడితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనే ఎడ్విన్ బజ్ అల్డ్రిన్.
అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపై నాసా వ్యోమగాములు ముగ్గురు కాలు మోపారు. కాలు మోపిన ముగ్గురిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ మాత్రమే. ఎడ్విన్ ఈనెల 20వ తేదీన 93వ జన్మదినం చేసుకున్నాడు. పుట్టిన రోజు నాడు ప్రత్యేకంగా ఉండాలని భావించి 63 ఏళ్ల అంకా ఫౌర్ ను వివాహమాడాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కలిఫ్ లో నిరాడంబరంగా వీరి వివాహ తంతు ముగిసింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా వీరి వివాహ ఫొటోలను పంచుకున్నాడు.
మూడుసార్లు అంతరిక్షంలోకి..
అమెరికాలో ప్రముఖ వ్యోమగామిగా ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ ప్రఖ్యాతిగాంచాడు. ఆయన మూడుసార్లు అంతరిక్షంలో సంచరించాడు. చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తో కలిసి ఎడ్విన్ 19 నిమిషాల పాటు నడిచాడు. 1971లో నాసా నుంచి పదవీ విరమణ పొందిన 1998లో షేర్ స్పేస్ ఫౌండేషన్ ఏర్పాటుచేశాడు. ఈ ఫౌండేషన్ ద్వారా అంతరిక్ష ప్రయోగాలపై తనకు చేతనైన సహాయం చేస్తున్నాడు. కొత్త వారికి అంతరిక్ష పరిశోధనలపై అవగాహన, శిక్షణ అందిస్తున్నాడు.
On my 93rd birthday & the day I will also be honored by Living Legends of Aviation I am pleased to announce that my longtime love Dr. Anca Faur & I have tied the knot.We were joined in holy matrimony in a small private ceremony in Los Angeles & are as excited as eloping teenagers pic.twitter.com/VwMP4W30Tn