నెదర్లాండ్స్లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. వలసల నియంత్రణపై ఏకాభిప్రాయం సాధించలేదు. కూటమిలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రధాని పదవీకి మార్క్ రట్ రాజీనామా చేశారు.
Dutch Government Collapses Amid Row Over Migrants' Entry Curbs
Netherlands Government: నెదర్లాండ్లో సంకీర్ణ ప్రభుత్వం (Netherlands Government) కుప్పకూలింది. దేశంలో వలసల నిరోధంపై సంకీర్ణ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రధాని మార్క్ రట్ (Mark Rutte) తన పదవీకి రాజీనామా చేశారు. సంకీర్ణ కూటమి ఏర్పడిన ఏడాదిలోనే ప్రభుత్వం పడిపోయింది. కూటమిలో అభిప్రాయబేధాలు ఉన్నాయి. వలస విధానంపై చివరి విడత జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తన రాజీనామా లేఖను నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెక్సాండర్కు అందజేశారు.
విదేశీ శరణార్థుల వలస శిబిరాలు కిక్కిరిసిపోయిన విషయం గతేడాది సంచలనం రేపింది. వలసల కట్టడికి వీవీడీ పార్టీ నేత మార్క్ రట్ (Mark Rutte) ప్రయత్నించారు. శరణార్థుల కుటుంబ సభ్యులను దేశంలోకి అనుమతించడంపై పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అదీ సక్సెస్ కాలేదు.. దీంతో ప్రధానమంత్రి పదవీకి రాజీనామా చేశారు.