కృష్ణా: పామర్రులో జరిగిన ‘సెమీ క్రిస్మస్’ వేడుకలో ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా భావోద్వేగ ప్రసంగం చేశారు. “నేను మీలో ఒకడ్ని, మీ శ్రేయోభిలాషిని, మీ అభిమానంతో గెలిచిన మీ స్థానిక సభ్యుడిని, మీ ఇంటి పెద్ద కొడుకుగా నియోజకవర్గ ప్రగతి సాధించేందుకు పెద్ద పాలేరుగా పనిచేస్తున్నా,” అని ఆయన అన్నారు. తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.