NTR: చైల్డ్‌కేర్ లీవ్ వినియోగానికి సంబంధించి ఉన్న 18 ఏళ్ల వయస్సు పరిమితిని తొలగిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వినియోగించుకునేలా జీవో నం.70 విడుదల చేయడంపై ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 4,600 మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు తెలిపారు.