తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.