TG: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం రాస్పెల్లిలో విషాదం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి బొమ్మెళ్ల రాజయ్య.. ఓడిపోతాననే భయంతో పోలింగ్ జరుగుతుండగానే పురుగుల మందు తాగాడు. బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బులు పంచారని.. తన దగ్గర పంచడానికి డబ్బు లేదని వాపోయాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.