ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాల నటిగా ప్రూవ్ చేసుకున్న వారు.. హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్గా బలగం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది గంగోత్రి పాప కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు స్టాలిన్, రాజన్న బాలనటి బేబీ ఆని హీరోయిన్గా తెరంగేట్రానికి రెడీ అవుతోంది.
Rajanna: స్టాలిన్, అతిథి, రెడీ, ఏక్ నిరంజన్, ఖలేజా, రాజన్న సినిమాల్లో బాల నటిగా నటించించి ఆని. ముఖ్యంగా రాజన్న సినిమాతో ఆనికి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ఈ సినిమాలో.. ఆని కీ రోల్ ప్లే చేసింది. కథ మొత్తం ఈ పాప చుట్టే తిరుగుతుంది. రాజన్న సినిమా వచ్చి 12 ఏళ్లు కావొస్తుంది. కాబట్టి ఇప్పుడు హీరోయిన్గా రెడీ అపోయింది బేబీ ఆని. ఇప్పటికే ఓ ఫోక్ సాంగ్ కూడా చేసింది. ఈ పాటలో ఆని తనదైన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ‘తికమక తాండ’ అనే సినిమాతో ఆని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. రామకృష్ణ, హరికృష్ణ అనే ఇద్దరు కవలలు హీరోలుగా వెంకట్ దర్శకత్వంలో.. టిఎస్ఆర్ గ్రూప్ అధినేత టిఎస్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
దర్శకుడు మాట్లాడుతూ ‘1990 గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ సమస్య వల్ల గ్రామం అంతా మతిమరుపుతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి వారంతా ఎలా బయటపడ్డారనే కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నాం. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో షూట్ చేశాం’ అని అన్నాడు. ఇక నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘తన ఫస్ట్ సినిమాకు మంచి కథ కుదిరింది.ఎక్కడ అసభ్యత లేని కథ ఇది. కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని ఈ చిత్రం అలరిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. సిద్ శ్రీరామ్ పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్ తెచ్చుకుందని’ అని అన్నారు. మరి ‘తికమక తాండ’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాతో.. ఆని హీరోయిన్గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.