NZB: భీమగల్ మండలంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారు కుటుంబ సభ్యుల సహాయంతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంపై అవగాహనతో ప్రతి ఓటు విలువైనదని చాటుతూ ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు.