Microsoft India President Anant Maheshwari Resigns
Microsoft India President Resigns: మెక్రోసాప్ట్ ఇండియా (Microsoft India ) ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి (Anant Maheshwari) తన పదవీకి రాజీనామా చేశారు. గత ఏడేళ్ల నుంచి కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు. అనంత్ పదవీ నుంచి తప్పుకోవడంతో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఇరియానా ఘోష్ మైక్రోసాప్ట్ ఇండియా (Microsoft India ) ఎండీ పదవీ చేపట్టబోతున్నారు. ఈ అంశాన్ని మెక్రోసాప్ట్ అధికార ప్రతినిధి ధృవీకరించారు.
‘అనంత్ మహేశ్వరి (Anant Maheshwari) ఇండియా చీఫ్ పదవీ నుంచి తప్పుకుంటున్నారు. ఇండియాలో తమ వ్యాపార కార్యకలాపాలు అభివృద్ది చేయడం, సంస్థలో మంచి సంస్కృతి అలవాడేందుకు కృషి చేశారు. అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాం’ అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇరియానా ఘోష్ ఎండీ పదవీ చేపట్టడంతో సీఓఓ బాధ్యతలు నవ్‌తేజ్ బాల్ చేపడుతారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ బిజినెస్‌లో వెంకట్ కృష్ణణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు చేపడుతారని వివరించారు.
అనంత్ మహేశ్వరి (Anant Maheshwari) మెక్రోసాప్ట్ (Microsoft ) కంపెనీ కన్నా ముందు హనీవెల్ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మెక్ కిన్సే అండ్ కంపెనీ ఎంగేజ్మెంట్ మేనేజర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. మరోవైపు మెక్రోసాప్ట్ సీనియర్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస రెడ్డి ఈ ఏడాది చివరి నాటికి గూగుల్‌లో చేరే అవకాశం ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. ఆయన ఇదివరకు ఆపిల్ ఇండియా రెగ్యులేటరీ బృందంలో పనిచేశాడు. స్వీడిష్‌కు చెందిన ఎరిక్సన్ ఏబీ లోకల్ యూనిట్లో ప్రభుత్వ వ్యవహారాలను చూశారు.